ప్రకటన : సమాజం లో జరుగుతున్న అనేక సంఘటనలు ఆధారంగా సాధారణ విశ్లేషణ ఇవ్వటం జరిగింది. ఈ వ్యాసం లో చర్చించిన అంశాలు ఏ ఒక వ్యక్తి (లేదా వ్యక్తులు )జీవితాన్ని ఉద్దేశించినది కాదు. అభిప్రాయాలు కేవలం వ్యక్తిగతం . ప్రతి ఇంట్లో ప్రేమ పెళ్లిళ్లు ఉండటం ఇది సున్నితమైన అంశం గా మారింది
ఒక తెలుగు సినిమా కథ . ఆకతాయిగా తిరిగే అబ్బాయి. ఒక మధ్య తరగతి అమ్మాయి. పని పాట లేని కథానాయకుడు అమ్మాయి వెంట పది సార్లు తిరుగుతాడు. అమ్మాయికి ఏవో ఇబ్బంది కరమైన సంఘటనలు ఎదురు అవుతాయి. కాళీగా వున్నా హీరో కి ఆ సమస్యలు తీర్చడమే పని. కథ నాయిక తనకి తెలియ కుండానే ప్రేమలో పడుతుంది. ఈ ప్రేమ విషయం ఇంట్లో తెలుస్తుంది. పెళ్లి కి ఒప్పుకోడు కాబట్టి అమ్మాయి తండ్రి ప్రతి నాయకుడు(villan ). చివరికి నాటకీయ పరిణామాల మధ్య హీరో అందరికి ఉపదేశం చేస్తాడు. పిల్లల సంతోషం అన్నిటికంటే ముఖ్యం అని క్లాస్ తీసుకుంటాడు. అమ్మాయి అమ్మ నాన్న అబ్బాయి అమ్మ నాన్న అందరు తప్పు చేసాము అని బాధ పడతారు.
***********------------------************
తెలుగు సినిమాలలో ఎక్కువ శాతం సినిమా లో ఇదే కథ. ప్రేమే కథ వస్తువు. ప్రేమ లేకపోతే జీవితమే వ్యర్థం అన్నట్లుగా జీవితంలో మరొక పని లేనట్లుగా వేరే కథాంశం లేదు. ఇది చాలదన్నట్టుగా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలతో , ప్రత్యేక సినిమాతో రోజంతా హోరెత్తిస్తుంటే అసలే అయోమయం లో ఉన్న యువత ఏ దారి పడుతుంది? అందరు ప్రేమ పెళ్లి చాల ఆదర్శం అని చెప్పే వాళ్లే . ఎవ్వరు మాట్లాడని చూపించని నాణేనికి ఇంకో వైపు చూపించడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.
ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలు ఉంటున్నారు ఎవరికైనా. వాళ్ళ ని ఆడ పిల్ల మగ పిల్లాడా తేడా లేకుండా ఏంతో అపురూపం గా పెంచి పెద్ద చేసి శక్తి కి మించి వాళ్ళని చదివిస్తున్నారు. మళ్ళి పిల్లల ఇష్టం తెలుసుకుని వారికీ అన్ని విధాలా తగిన వరుడు లేదా వధువు నిచూసి పెళ్లి చేస్తున్నారు.ఒక మధ్య తరగతి తల్లి తండ్రి పిల్లల ఎదుగు దల లోనే వారి సంతోషం చూసుకుంటున్నారు. అన్ని అవరోధాలు కష్ట నష్టాలు దాటి ఊపిరి తీసుకునే సరికి ఒక పెద్ద గుది బండ తయారు అవుతోంది , అదే ప్రేమ. సహ విద్యార్థి లేదా సహోద్యోగి ని ఇష్టపడుతున్నాను, ఇక నా పెళ్లి నా ఇష్టం అని. ఇక అమ్మ నాన్న ఆవేదనని అర్ధం చేసుకునేది ఎవరు? ఇన్ని సంవత్సరాలు పిల్లల అభివృద్ధి కి శ్రమించిన అమ్మ నాన్న వారికీ తగిన జీవిత భాగస్వామిని ఎంపికచేసే సమర్దత లేదా?
కౌమార దశ, యవ్వన దశ ప్రారంభం స్త్రీ పురుషుడు మధ్య ఆకర్షణ ఎక్కువ ఉండే సమయం. అమ్మాయి అబ్బాయి ఒకరి తో ఒకరు ఎక్కువ సమయం గడపాలని అనిపించే సమయం. ఇక కళాశాల లో అడుగు పెట్టె సరికి పిల్లల స్మార్ట్ ఫోన్ కొని ఇవ్వక తప్పని పరిస్థితి. ఉన్నత చదువుల కోసం వేరే ఊర్లో హాస్టల్ లో ఉంచడం తప్పట్లేదు. యువత వారి దగ్గర ఉన్న వనరులుని వారికీ ఇచ్చిన స్వేచ్చని దుర్వినియోగంచేసి పక్క దారి పడుతోంది . చదువు కునే డప్పుడు స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చింది సమాచారం ఉండడానికి గాని ప్రియుడు / ప్రియురాలు తో గంటలు గంటలు మాట్లాడేందుకు కాదు. ఈ దశ లో లక్ష్యం మీద దృష్టి పెట్టి ప్రేమ పెళ్లి లాంటి నిర్ణయాలు వాయిదా వెయ్యటం మంచిది.
చట్ట ప్రకారం మైనారిటీ తీరిన అమ్మాయి/అబ్బాయి కి వారికీ ఇష్టం వచ్చిన్నట్ట ఎవరినైనా కలిసే స్వేచ్ఛ ఇవ్వాలా ? వాళ్ళు ఎక్కడ ఎవరిని కలుస్తున్నారో తెలుసుకోకూడదా అమ్మ నాన్న? అమ్మాయిలు ఇంట్లో చెప్పకూండా ప్రియుడితో దగ్గర గా మెలగటం , (వాడు ఎటువంటివాడో తెలుసుకోకుండా ), వాడు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు , వీడియోలు తీసి వాటిని దుర్వినియోగం చెయ్యడం చూస్తున్నాం. అప్పుడు సమస్య అమ్మాయిది కాదు, కుటుంబానిది , పోలీసులది అవుతుంది. ఆడ మగ కలిసి పని చెయ్యాల్సినప్పుడు పెళ్లి ముందైనా తర్వాతైనా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండటం సమస్య ని నివారించి వారు అవుతారు. స్నేహం అనే గీత దాటి అతి చనువు ఎవరి పట్ల చూపించకుండా ఉంటె మంచిది. నిజంగా ఒక వ్యక్తి ని ఇష్టపడితే చాల లోతుగా పరిశీలించి ఇద్దరి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు . ఈ లోపల కలిసి సినిమాలు , రెస్టారెంటు , షికార్లు విహార యాత్రలు అని తిరిగనక్కర్లేదు.
పెళ్లి వయసు కి వచ్చిన యువతీ యువకులు తమ జీవితానికి కావాలో తమకు తెలుసు అనుకోవచ్చు. అమ్మ నాన్న వారి కంటే తెలివి తక్కువ వారు కావచ్చు కానీ వారు ఒక జీవితాన్ని చూసారు. ఒక పెళ్లి జీవితంలో ఏ దశ లో ఎలాంటి పర్యవసానాలు తీసుకుని వస్తుందో చూసిన వారు. ఆ అనుభవం తో మెరుగైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఒక అమ్మాయి అబ్బాయి వారి మధ్య ఏర్పడిన పరిచయం వల్ల ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకున్నాం అని అనుకుంటారు. కానీ జీవితం చాలా లోతైనది.వ్యక్తి గత జీవితానికి ప్రాధాన్యం తగ్గటం సామజిక జీవితానికి ప్రాధాన్యం ఎక్కువ గా ఉండటం ప్రేమ పెళ్లిళ్లు పెరగటానికి కారణం.
నాలుగు సార్లు రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఒకటే బ్రాండ్ ఐస్ క్రీం నచ్చటం , ఒకటే సినిమా హీరో నచ్చడం , ఒకటే రంగు నచ్చడం మంచి అవగాహన ని గుర్తులు గా భావిస్తున్నారు. ఒక ఇంట్లో కలిసి ఉండడం మొదలు పెట్టాక ఎన్ని సర్దుబాట్లు చేసుకుంటే సంసారం ఒక తాటి పై నడుస్తుంది అర్ధమవుతుంది. సినిమా లో పెళ్లి కి అందరు పెళ్ళికి ఒప్పుకోవడం తో కథ ముగుస్తుంది. నిజ జీవితంలో కథ అప్పుడే మొదలు అవుతుంది. తర్వాత వచ్చే సమస్యలు ఏ సినిమా లోను చూపించరు. ఒక ప్రముఖ మనస్తత్వవేత్త చెప్పినట్లు ఇద్దరు స్నేహితులు , ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకుని భార్య భర్తలు అయ్యారు. చివరికి భార్య భర్తలు గా మిగిలారు.
అసలు పెళ్లి ఇద్దరు వ్యక్తుల కు సంబంధించిన విషయమా కుటుంబాలాకు సంబంధిచినదా? పాశ్చాత్య దేశాల్లో వ్యక్తి కి స్వేచ్ఛ ఎక్కువ గా ఉంటుంది. చివరికి ఆ వ్యకి వ్యక్తి గానే ఉంటాడు. ఎవరి కష్ట నష్టాలు వాళ్ళవే. ఎవరి కానీ భారత దేశంలో పరిస్థితి అది కాదు.కుటుంబ తాలూకా అస్తిత్వం ఇంకా ఉంది. పెళ్లి అయ్యి పిల్లో పిల్లాడో పుట్టడానికి కుటుంబం సహకారం కావాలి. ప్రతి సందర్భానికి తాతలు అమ్మమ్మల ఆశీర్వాదం కావాలి. కానీ పెళ్లి నిర్ణయం లో మాత్రం ప్రేక్షక పాత్ర వహించాలి. ఉమ్మడి కుటుంబాలు కానప్పటికీ మనం చేసుకునే పెళ్లి అందరికి ఆమోద యోగ్యం గా ఉండాలని ఎందుకు అనుకోవడం లేదు.ఆర్ధిక స్థిరత్వం లేకుండా పెళ్లి చేసుకుని తర్వాత తండ్రి అండగా ఉండాల్సిన సందర్భాలు ఉంటున్నాయి..
పెళ్లి అంటేనే సర్దుబాటు. రెండు వేరువేరు ఇళ్లల్లో పెరిగిన ఇద్దరు ఎన్నో విషయాల్లో మారి ఎన్నో త్యాగాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. భిన్నమైన కుటుంబ నేపధ్యాల లో పెరిగిన ఇద్దరు అయితే ఎక్కవ సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన సంసిద్ధత లేకుండా పెళ్లి చూసుకుని గొడవలు పడే వాళ్ళు ఉన్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు ఆధిపత్య పోరుతో పిల్లలకి సరైన వాతావరణం లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రేమ పెళ్లి అయినా విడాకుల శాతం ఎక్కువే ఉంది. ఏ అమెరికా అమ్మాయినో అబ్బాయినో చేసుకున్న సంపన్న వర్గాల్లో అది పెద్ద సమస్య కాదు. మధ్య తరగతి జీవితం లో అది పెద్ద విషయం . వృధ్ధాప్యం లో కోడాలో కూతురో వండి పెట్టాలని అనుకునే వారు ఏమిచేస్తారు.?
ప్రేమ పెళ్ళికి అబ్బాయి కి అయితే ఆమోదం ఉంటుంది, అమ్మాయికి అయితే ఉండదు అనే వాదన ఉంది. దీనికి కారణం మనం పితృస్వామ్య సమాజం లో ఉండటమే. ఏ అమ్మాయి అయినా మన ఇంటికి వస్తే మన పద్ధతులే పాటిస్తుంది అన్నదే కారణం. అమ్మాయికి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వడం ఇవ్వక పోవడం సమస్య కాదు.
ప్రేమ పెళ్ళికి పెద్దలు అభ్యంతరం చెప్పేవి రెండు. ఒకటి కులము , రెండు అంతస్తులో తేడా. కులం ఏమిటి ఇవాళ అంటే కులాన్ని బట్టి ఆచారాలు ఉన్నాయి. పుట్టుక నుంచి గిట్టే వరకు ప్రతి దశ లోను ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్దతి ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడే క్రమంలో భాగం గా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి. వేరొకరి పద్ధతులని గౌరవించాలి. ఒక్కొక్క ప్రాంతానికి వర్గానికి కొన్ని ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఈ తేడాలన్నీ కలిసి బ్రతకటానికి అడ్డు కాదని ఇద్దరు భావిస్తే , అది వారి పెద్దలకి సమ్మతం అయితే నిరభ్యంతరంగా పెళ్లి చూసుకోవచ్చు. పెద్దలకి అంగీకారం కానప్పుడు అది చిక్కు ముడి విప్ప లేని ప్రశ్నగా మిగులుతుంది. ఒప్పించి పెళ్లి చేసుకుంటాం అనే వాళ్ళు సినిమ లో ఉన్నారు కానీ నిజ జీవితంలో లేరు. తప్పక చెయ్యడం తల్లితండ్రుల వంతు అవుతోంది.
సాంస్కృతిక విభేదాలు ఉన్న వారు ఒక ఇంట్లో సర్దుకుపోవటం అంత సులువైన విషయం కాదు. ఒక వ్యక్తి పెరిగిన కుటుంబ నేపధ్యం కట్టు బొట్టు , ఆహారపు అలవాట్లు వగైరా అనేక అంశాల మీద ప్రభావం చూపుతుంది. ఈ తేడాలను సమన్వయము చేసుకుంటూ సాగిపోవటం కత్తి మీద సాము. . అమ్మాయి అబ్బాయి కుటుంబం తో ను అబ్బాయి అమ్మాయి కుటుంబం తోనూ మెలగ గలగడం సాధ్యమో కాదో పెళ్లి ముందు అంచనా వేసుకో గలరా ప్రేమికులు ?
ఇక మతాంతర వివాహాలు కుటుంబాల్లో సృష్టిస్తున్న ప్రకంపనలు అన్ని ఇన్ని కాదు. క్రైస్తవ మత ప్రచారం ఉధృతం గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో మతం మార్చుకున్న ఒక వ్యక్తి, , హిందూ ఆచారం ప్రకారం తమ తల్లి తండ్రులకు దహన సంస్కారాలు నిర్వహించడానికి నిరాకరించాడట. మతాంతర వివాహాలు చేసుకున్న వారి తీరు ఇలానే ఉండొచ్చు . పెళ్లి చేసుకోవటానికి ఉన్న విశాల దృక్పథం తర్వాత ఉండక పోవచ్చు . ఎవరో ఒకరు వేరొకరిని మతం మార్చడానికి ప్రయత్నిస్తారు . కట్టు బొట్టు మార్చికోమని ఇబ్బంది పెట్టవచ్చు. పిల్లల పెంపకం లోను విభేదాలు రావచ్చు. మత విశ్వాసాల్లో ఉన్న తేడాల తో ఒక ఇంట్లో కలిసి జీవించటం తేలికేనా ????
ఇవాళ ఆధునికత పేరిట మన కట్టు బొట్టు అహార్యం లో అనేక మార్పులు వస్తున్నాయి . పెళ్లి పేరు తో వీటిని వదిలేస్తే ఏమవుతుంది అని అనుకుంటే, మనవైన సాంస్కృతిక మూలాల నుండి మనం దూరంగా మరలు పోతున్నాం అని గుర్తు ఉంచుకోవాలి. !!! వ్యక్తి గత జీవితానికి సంబందించిన పెళ్లి అనే అంశం లో కులమో మతం చూసుకుని పెళ్లి చేసుకోవటం సంకుచితం కాదు.
No comments:
Post a Comment