Monday, September 21, 2020

మిథునం

మిథునం  అంటే జంట.ప్రతి మనిషి పుట్టుకకి ఆరంభం ఒక జంట. తల్లి గర్భం లో  చిన్న జీవిగా   జీవన ప్రయాణం మొదలవుతోంది . నెమ్మదిగా అమ్మ నాన్నల తోబుట్టువుల మధ్య పెరిగి పెద్ద అవుతూ కుటుంబం లో ఒకడి గా తన ఉనికి ని తాను గుర్తిస్తున్నాడు మనిషి .చదువులు ఉద్యోగాలు పేరిట గూటిని వదలి  గమ్యాన్ని వెతుకుంటూ వెళ్తున్నాడు.ఆ ప్రయాణం లో ఒక తోడు ని వెతుక్కొని జంటగా మారుతున్నాడు. ఆ జంట మరల వారి ప్రతిరూపాల్ని సృష్టిస్తున్నది. వారికీ పుట్టి పెరిగిన పిల్లలు పెద్ద వాళ్ళు  ఈ గూటిని వదిలి వెళ్తున్నారు. ఇది నిరంతరాయంగా కొనసాగుతున్న ప్రక్రియ. రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోవాలి కదా. అప్పటి వరకు అలవాటు అయిన ఊరు ని పరిచయాలల్ని వదిలి కొత్త ప్రపంచం లో కి వెళ్ళటం అప్పుడు బాధగానే ఉంటుంది. ఇలా ఒక నాడు వేరు పడి బ్రతకటం అలవాటు చేసుకున్న వాళ్ళు , తమ పిల్లలు పెద్దావుతారు అని తెలిసి పిల్లల మీద మమకారం పెంచుకుంటారు. చివరికి ఆ గూటిలో జంట మాత్రమే మిగులుతోంది. 

ఇప్పటి పరిస్థితుల్లో ఉన్న ఊరిలో ఉద్యోగం దొరకటం కష్టం. ఎదో ఒక నగరమో మహా నగరమో వెళ్లాల్సిందే. పిల్లలు చదువులు ఉద్యోగాలు కోసం ఇళ్లకు వదిలి వెళ్ళాక పెద్ద వాళ్ళు ఒక్కళ్లే ఉండాల్సి వస్తోంది. ఇన్నాళ్లు ఉద్యోగమూ పిల్లలు అని విశ్రాంతి లేకుండా పని చేసిన తల్లి తండ్రులు కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. పిల్లలు లేని వెలితి ఉంటుంది. అయినా పిల్లల పుట్టుక కతో వారికీ దూరమైనా ఏకాంతం మళ్ళి  వారికీ దొరుకుతుంది. ఓపిక తగ్గుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ప్రతి ఒకరి జీవితం లో వృధ్ధాప్యం ఒక తప్పనిసరి మజిలీ. దీనిని శారీరిక ఓపిక ఆర్ధిక స్తోమత   మేరకు అందంగా ఆనందం గా మలచుకోవచ్చు. నచ్చిన ప్రదేశాలు తిరిగి రావచ్ఛు . బోళ్ళన్నీ అవకాశాలు ఉన్నాయి ఇవాళ. అడప దడప దూరాన ఉన్న మనవలల్ని  చరవాణి లో చూడవచ్చు.  ఏ సినిమా కో  షీకారుకో వెళ్లి రావచ్చు. బయటకు వెళ్లడం ఇష్టం లేకపోతే ఇంట్లో    చూసేందుకు వంద మార్గాలు ఉన్నాయి . ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం చూసిన బ్లాక్ అండ్ వైట్ సినిమా టీవీ లో కనపడితే అతుక్కుపోవచ్చూ . వారికి  అభిరుచి(Hobby ) ఉన్న పనులు ఏమైనా చెయ్య వచ్ఛు. తోట పని, ఇంటి పని ఏదైనా. ఇన్నాళ్లు ఉద్యోగం లో సమయం దొరకక పోయిన , ఇప్పుడు ఆ భర్త ఇల్లాలికి ఇంటి పనిలో వంట పనిలో సహాయం  చెయ్య వచ్చు. 

మన పూరికులు చూపిన ఆధ్యాత్మిక మార్గంఉండనే ఉంది. పురాణాలూ , తత్త్వం లో అనేక గ్రంధాలూ అందుబాటులో ఉన్నాయి. టీవీ లో అంతర్జాలం లో ఆధ్యాత్మిక ప్రవచనాలకి కొదవే లేదు. పుణ్య క్షేత్రాలు వెళ్ళటం సులువు అయింది. దానితో పాటే సేవ మార్గం కూడా ఉన్నది. బాధ్యతలు నెరవేర్చాక రూపాయి మిగులు ఉంటె, మనకి  ఉన్న దానిలో అవసరం ఉన్న వాళ్ళకి త్రుణమో పణమో ఇవ్వచ్చు . సాంకేతికత ఎలా అయితే మనుషుల మధ్య దూరాన్ని పెంచిందో అదే సాంకేతికత దూరాల్ని తగ్గించింది. విమానం ఎక్కితే కొన్ని గంటలలో ఏ దేశమైన చేరుకోవచ్చు. కొంత కాలం అక్కడ ఉంది రావచ్చు . స్వదేశమైనా విదేశమైన పిల్లల ఇంట్లో కొన్నాళ్ళు ఉండచ్చు .ఇన్నాళ్లు సంసార నావ ని అవతలి ఒడ్డు కు చేర్చే క్రమం లో తాము తిన్నామా మంచి బట్ట కట్టామా మర్చి పోయి ఉంటారు. ఇప్పుడు తమ గురించి తాము పట్టించుకునే అవకాశం దొరికింది. ఈ సమయం లో భార్య భర్త ఒకరి కోసం ఒకరు కోసం ఒకరు ఉన్నట్లయితే వృధాప్యము ఒక మధుర ఘట్టమే .

తరాల మధ్య అంతరం ఎక్కువగా ఉంటున్న రోజులు ఇవి. కారణాలు అనేకం. ఈ క్రమంలో పిల్లలు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే  జీవితం అక్కడితో ముగిసి పోలేదు. కూతురో కోడలో పిల్లల పెంపకం లో సలహా తీసుకోలేదని బాధ పడుతూ ఉండక్కర్లేద్దు . కొడుకు కి ఆర్ధిక మైన జాగ్రత లేదని చెపితే వినడని చింతించి ఉపయోగం లేదు. ఒక జీవిత కాలపు అనుభవం ఒక వైపు . ఉరకలు వేసే యువ రక్తం ఇంకో వైపు .అమ్మ నాన్నచెప్పిన దానిలో ఆంతర్యం అర్ధం కావాలంటే ఆ వయసు పరిణితి రావాలి.జీవితమే పాఠాలు నేర్పాలి. చిన్న కుటుంబాలు(ఇద్దరు పిల్లలు ) కావటం తో వారి మీదే ఆసక్తి ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నారు తల్లి తండ్రులు.

ఇక జంట లో ఎదో ఒక పక్షి ముందు రాలిపోతుంది. ప్రతి ఒక్కరు ఊహ తెలిసి తాతయ్య అమ్మమ్మలు వెళ్లపోవడము చూస్తాం . మధ్య వయసు లో అమ్మ నాన్నలు కనుమరుగు అవుతారు.ఆ విచారం దిగ మింగుకుని జీవితాన్ని కొనసాగిస్తారు అందరు. మలి వయసు లో జీవిత భాగస్వామి ని కోల్పోవడం కష్టం. ఇద్దరి లో ఎవరో ఒకరు ఆ వియోగాన్ని భరించాలి. ఐదు దశాబ్దాల సహజీవనం తో పెన వేసుకున్న ఆత్మ బంధం దూరమైనప్పుడు ఆ వేదన వర్ణణాతీతం. కాలం గాయాన్ని మాన్పుతుంది . ఈ సమయం లోనే పిల్లలు బాసట గా నిలవాలి.

ఇక్కడ తనికెళ్ళ భరణి 'మిధునం' గురించి చెప్పుకోవాలి .  పసుపు కుంకుమ తో పోవడమే ఒక స్త్రీ అంతిమ లక్ష్యం గా తెలుగు సినిమా లో చూపిస్తూ వచ్చారు . ఈ చిత్రం అంతిమ సన్నివేశం లో కథ నాయికా (లక్ష్మి పాత్ర ) లాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు అని చూపించడం ప్రేక్షకుల చేత కంట తడి పెట్టిస్తుంది. కొంత మంది ఇదంతా  సహజమైన ప్రక్రియ గా భావించి కోలుకుంటారు. కొంత మంది తట్టుకో లేక పోతారు.  

పిల్లలు సకుటుంబం గా ఏ పండగకో పబ్బానికో వచ్చి పోతుంటే  కొత్త ఉత్సాహం వస్తుంది అందరికి. ఉన్న ఇద్దరు పిల్లలు విదేశం లో స్థిరపడి పోతే సంవత్సరానికి ఒక సారి కూడా మనువలతో గడప లేక జీవితాన్ని నిస్సారంగా వెళ్ళ తీస్తున్నారు ఏంతో మంది. ఇద్దరు ఉండి  ఓపిక ఉన్నంత వరకు పరవాలేదు . ఓపిక తగ్గినప్పుడు పిల్లల దగ్గరికి వెళ్లి ఉండటం మంచి పని. అక్కడ వారికి సౌకర్యం గా ఉండేటట్లు చూసుకోవడం పిల్లల బాధ్యత.  అలాగే పెద్దల  కొన్ని విషయాల్లో సర్దుబాట్లు చేసుకోవాలి. ఈ కాలం తల్లి తండ్రులు సిద్ధం గానే ఉంటున్నారు.  ఇల్లు ఊరు అని పట్టుకుని ఉండక మెరుగైన వైద్య సదుపాయం ఉన్న నగరాలకు వెళ్లేందుకు ఇష్ట పడుతున్నారు. 

ఆధునిక జీవన విధానం లో ఉద్యోగ జీవితానికి వ్యక్తిగత జీవనానికి సమన్వయము చేసుకో లేకపోవడమే ఓల్డ్ ఏజ్ హోమ్ లు పెరగడానికి కారణం. వృద్ధాప్యం లో తల్లి తండ్రి  చూస్తుండాల్సిన బాధ్యత ఉంది  అనుకుంటే మార్గాలు అవే ఉంటాయి. " ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డల విద్య బోధన అభివృద్ధి కి పాటుపడటం "ప్రాధమిక బాధ్యతల్లో ఒకటి గా ఉందో అలాగే పెద్ద వయసు లో ఉన్న  తల్లి తండ్రి ని చూడడం కూడా ప్రాధమిక బాధ్యతల్లో ఒకటి గా చేర్చాలి. 

 

 


THE SMART PHONE

  Mobile phone market seems to be bigger than television or computer market as every adult needs a mobile phone and it ought to be replaced ...